ఖమ్మం రూరల్, జూలై 16 : కస్తూరిబా గాంధీ విద్యాలయంలో విద్యార్థినులకు అన్ని రకాల వసతులు కల్పించాలని, వసతుల కల్పనలో రాజీ పడవద్దు అని ఖమ్మం రూరల్ మండల తాసీల్దార్ పి.రాంప్రసాద్ అన్నారు. బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని బైపాస్ రోడ్డులో గల కస్తూరిబా గాంధీ విద్యాలయంను ఎంఈఓ శ్రీనివాస్‌తో కలిసి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహంలోని మరుగుదొడ్లు, మంచినీటి ప్లాంట్, విద్యాలయ ఆవరణ గ్రౌండ్ పరిశీలనతో పాటు వంటగది, వండిన ఆహార పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలాంటి లోటు రాకుండా విశాలమైన తరగతి గదులు, పాఠ్య పుస్తకాలు, ఇతర నోట్ బుక్స్, యూనిఫామ్‌ను అందజేయడం జరిగిందన్నారు. తరగతులకు అనుగుణంగా ఫ్యాకల్టీ సైతం అందుబాటులో ఉందన్నారు. విద్యార్థులకు ఇతర అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని స్పెషలాఫీసర్‌కు సూచించారు.ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్పెషలాఫీసర్ ఆయేషా బేగం పాల్గొన్నారు.