ఖమ్మం రూరల్ : పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో, వార్తా మాధ్యమాల్లో వస్తున్న వార్తలను పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ( Kandala Upender Reddy ) ఖండించారు. ఉద్యమ సాధకుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ( KCR ) నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీలో ప్రయాణం కొనసాగుతుందని వెల్లడించారు. పాలేరు నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఇటువంటి పుకార్లను, ఊహాగానాలను నమ్మవద్దని కోరారు.