మధిర, ఆగస్టు 05 : ఆపదలో ఉన్నవారికి రక్త దానం చేయడం ద్వారా ప్రాణ దాతలుగా మారవచ్చని మధిర ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ ఆస్పత్రి నందు లైఫ్ ఆఫ్ గివింగ్ ఫౌండేషన్ చైర్మన్ ఎండి ఫై మూన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. ఆపద కాలంలో దాతలు ఇచ్చినటువంటి రక్తదానం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందన్నారు. రక్తం లేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి రక్తదాన శిబిరాలు ఒక వరం లాంటివన్నారు. ఈ రక్తదాన శిబిరానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుడు కుంచం కృష్ణారావు హాజరై శిబిరంలో 59వ సారి రక్తదానం చేసి పలువురి మన్నలని పొందారు.
ఈ శిబిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఖమ్మం డిస్ట్రిక్ట్ బ్రాంచ్ సహకారంతో దాతలకు పండ్లు, ఫ్రూట్ జ్యూస్, బిస్కెట్స్, వాటర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఖమ్మం డిస్ట్రిక్ట్ బ్రాంచ్ సెక్రటరీ సూర్యప్రకాశరావు, కో ఆర్డినేటర్ గజేంద్రుల నాగేశ్వరరావు, మేనేజింగ్ సభ్యుడు జల్లా వెంకటేశ్వర్లు, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ తెలంగాణ నేషనల్ వైస్ చైర్మన్ డాక్టర్ జి.డేనియల్ రాజు, కోన సత్యనారాయణ గుప్తా, పౌండేషన్ వ్యవస్థాపకులు కోన నరసింహారావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.