బోనకల్లు, మార్చి 25 : ఇచ్చిన హామీలను అమలు చేయమన్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలను అరెస్ట్ చేయటం దుర్మార్గమైన చర్యని సీపీఎం బోనకల్లు మండల కార్యదర్శి కిలారి సురేశ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఆశా వర్కర్లు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆశా కార్యకర్తలు వారి సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని వెళ్తుంటే పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం బాధాకరమన్నారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బంధం శ్రీనివాసరావు, గిరిజన సంఘం నాయకుడు గుగులోతు నరేశ్, మండల ఆశా వర్కర్స్ యూనియన్ కార్యదర్శి రావణ సరోజిని, యశోద, కేవీపీఎస్ నాయకుడు యేసుపోగు బాబు, ముష్టికుంట గ్రామ శాఖ సభ్యుడు కొమ్మినేని పురుషోత్తం పాల్గొన్నారు.