మధిర, మార్చి 22 : మధిర నియోజకవర్గ స్థాయిలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నట్లు ముస్లిం ఐక్య సంఘం సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు మౌలానా షేక్ ముజాయిద్దీన్ తెలిపారు. శనివారం జాన్మియా మసీదు నందు సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు పండుగ సరుకులు ( తోఫా) అందించడం జరుగుతుందన్నారు. ఈ నెల 24న ముదిగొండ మండలం, 25న బోనకల్లు. 26న ఎర్రుపాలెం. 27న మధిర మండలంలో మండల కమిటీల ద్వారా అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలను ముస్లిం ఐక్య సంఘం విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ జాకీర్ హుస్సేన్ పాల్గొన్నారు.