బోనకల్లు, ఆగస్టు 25 : దివ్యాంగుల విద్యార్థులకు ఖమ్మం జిల్లా బోనకల్లు మండల అధికారి దామాల పుల్లయ్య పరికరాలను సోమవారం పంపిణీ చేశారు. గత సంవత్సరం ఖమ్మంలో అలింకో క్యాంపు నిర్వహించారు. మండలంలోని నలుగురు దివ్యాంగ విద్యార్థులకు పరికరాల మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల విద్యార్థుల కోసం వారి అవసరాలను గుర్తించిన పరికరాలను మంజూరు చేశామన్నారు.
ముగ్గురు మానసిక వైకల్యం గల విద్యార్థులకు రూ. 15 వేల విలువ చేసే పరికరాలతో పాటు ఒక విద్యార్థికి చక్రాల కుర్చీ అందజేశామన్నారు. ఈ పరికరాలను ఉపయోగించుకొని వారు తగిన సామర్థ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఐ ఈ ఆర్ పి రేగళ్ల పుల్లారాణి , ఎంఆర్ సి సిబ్బంది మల్లికార్జున్, నాగుల్ మీరా, సి ఆర్ పి మహబూబ్ పాషా,అబ్రహం తదితరులు పాల్గొన్నారు.