కారేపల్లి, అక్టోబర్ 24 : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టో అద్భుతంగా ఉన్నదని, అన్నివర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారని వైరా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ అన్నారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలనే విధానంతో తొమ్మిదన్నరేండ్లుగా పాలన సాగిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో నిలిచిందన్నారు. మన నిధులు మనకే అనే నినాదాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తూ రాష్ట్రంలోని ప్రతీ పల్లెను, బస్తీని సమగ్రంగా అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కారేనని మూడో సారి ముఖ్యమంత్రి కేసీఆర్ సారేనని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల లబ్ధి పొందని కుటుంబం అంటూ లేదని, వారి ఆశీర్వాదాలే మరోసారి బీఆర్ఎస్ గెలుపునకు శ్రీరామరక్షన్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు గడప గడపనూ తట్టి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలను వివరించి కారు గుర్తుకు ఓటేసేందుకు కృషి చేయాలన్నారు. రెండు మూడు రోజుల్లో మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు సమావేశంలో జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమాశంకర్, నాయకులు హన్మకొండ రమేశ్, ఉన్నం వీరేందర్, జడల వెంకటేశ్వర్లు, అడప పుల్లారావు, మూడు జ్యోజి, జడల వసంత, బానోత్ కుమార్, జవ్వాజి శ్రీను, గౌస్‌పాషా, తాతా వెంకన్న, గడ్డం వెంకటేశ్వర్లు, పేర్ని వెంకటేశ్వర్లు, మణికొండ నాగేశ్వరరావు, సామేలు, చెవుల చందూ ,ఆదెర్ల రామరావు, సోమందుల నాగరాజు, బానోత్ కోటి, మర్సకట్ల రోషయ్య, జుంకీలాల్, రమేశ్ పాల్గొన్నారు.