మధిర, జూన్ 15: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు మధిర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిశోర్ కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి హోదాలో తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ఎన్నో సేవలు అందిస్తున్నారన్నారు.
మల్లు భట్టి విక్రమార్క ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంగా హనుమంతరావు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అద్దంకి రవికుమార్, బాణావత్ వెంకటరమణ నాయక్, వివిధ హోదాలలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.