మధిర, జులై 6 : మధిర మున్సిపాలిటీ పరిధిలోని అంబారుపేట ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ట్యాంక్ బండ్ అభివృద్ధి కోసం సుమారు 6 కోట్ల 45 లక్షల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు.
పర్యాటక సౌకర్యాల కల్పన పనులు మూడు కాటేజీ లు, బ్యాంకెట్ హల్, రెస్టారెంట్, చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్కింగ్ ఏరియా వంటి అభివృద్ధి పనులకు నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, గిడ్డంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరావు, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.