దమ్మపేట, సెప్టెంబర్ 11 : పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు ఇప్పటి నుంచి ప్రణాళికతో బోధించాలని డీఈవో వెంకటేశ్వరాచారి అన్నారు. గండుగులపల్లి, నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
డిజిటల్ తరగతుల బోధన, ఎఫ్ఆర్ఎస్ నమోదు, మధ్యాహ్న భోజన పథకం అమలు, స్కూల్ గార్డెన్, 10వ తరగతి ప్రత్యేక తరగతుల నిర్వహణ, యూడైస్ డేటా నమోదు తదితర అంశాలపై హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్ధ్యాలను తెలుసుకున్నారు. నాగుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ జిల్లా కోఆర్డినేటర్ ఎస్కె.సైదులు, ఎంఈవో లక్ష్మి, మండల నోడల్ అధికారి జగపతి, హెచ్ఎంలు సీతారామయ్య, మెచ్చు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.