కూసుమంచి, ఆగస్టు 28: టెన్త్లో ఉత్తమ ఫలితాలు రాబట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని డీఈవో సోమశేఖరశర్మ సూచించారు. ఇందుకోసం ప్రతి ఉపాధ్యాయుడూ కృషిచేయాలని, విద్యార్థులను తగిన విధంగా సన్నద్ధం చేయాలని సూచించారు.
కూసుమంచి మండలంలో బుధవారం పర్యటించిన ఆయన.. కూసుమంచి, ఈశ్వరమాధారం ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. టెన్త్ విద్యార్థుల వద్దకెళ్లి పలు ప్రశ్నలు అడిగారు. ఇప్పటి వరకు జరిగిన పాఠాల్లో విద్యార్థులు నేర్చుకున్న అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని వారి తల్లిదండ్రులకు కూడా తెలియజేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఏంఈవో శ్రీనివాస్, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు.