కొత్తగూడెం గణేష్ టెంపుల్, జూలై 19: నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఆదివారం పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముద్దా భిక్షం మాట్లాడుతూ ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణవేత్త సోనమ్‌వాంగ్ చుక్కు మద్దతు తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం నిందితులకు వత్తాసు పలుకుతున్నదని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ చేసిన దొంగలను కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నాయిని రాజు, జాటోత్ కృష్ణ, అమర్లపూడి రాము, ధర్మ, గోపాల్‌రావు, పెద్దబోయిన సతీష్, పృద్వి. వీరభద్రం, శివప్రసాద్ తదితరులు పాలగొన్నారు.
ఖమ్మంరూరల్, జూలై 19 : ఏదులాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పౌరసమాజం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వరంగల్ క్రాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ కారణంగా అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనను నిరసిస్తూ ఢిల్లీలో 22రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న మెగాసెసే అవార్డు గ్రహీత, పర్యావరణవేత్త సోనమ్‌వాంగ్ చుక్‌ను ఆసుపత్రిలో బంధించడం సరికాదన్నారు.
అనంతరం వరంగల్ క్రాస్‌రోడ్డు నుంచి ఖమ్మం కేబుల్ బ్రిడ్జి వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ప్రత్యామ్నాయ పౌర సమాజం అధ్యక్షుడు ఎస్ విజయ్, ఐవీ రమణారావు, రవిమారుత్, కాకి భాస్కర్, వివిధ పార్టీల నాయకులు బానోత్ కిషోర్, దండి సురేష్, శేషగిరి, సురేందర్, బషీర్, సుదర్శన్‌రెడ్డి, బందెల వెంకయ్య, రమేష్, మహబూబ్ అలీ, ఊడుగు వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, సాయిబాబ, దేవయ్య, కిషన్ పాల్గొన్నారు.