గోవులను అక్రమంగా తరలిస్తే కేసులు
పశువుల అక్రమ రవాణాపై పోలీస్ యంత్రాంగం నిఘా తీవ్రతరం చేసిందని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి గోవులను అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. మండలంలోని వినోభానగర్ సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టును గురువారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించడంతోపాటు భద్రతా ఏర్పాట్లపై సిబ్బంది పలు సూచనలు చేశారు.
- భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు
జూలూరుపాడు, మే 14 : పశువుల అక్రమ రవాణాపై పోలీస్ యంత్రాంగం నిఘా తీవ్రతరం చేసిందని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి గోవులను అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. మండలంలోని వినోభానగర్ సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టును గురువారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించడంతోపాటు భద్రతా ఏర్పాట్లపై సిబ్బంది పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గోవుల అక్రమ రవాణా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలని ఆదేశించారు. ప్రభుత్వం పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, ఇందులో భాగంగానే జిల్లావ్యాప్తంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచామని ఆయన వివరించారు. పశువులే కాకుండా గంజాయి, ఇసుక అక్రమ రవాణాపై ఉకుపాదం మోపుతున్నామని, విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కూడా కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఎస్పీ వెంట సీఐ శ్రీలక్ష్మి, ఎస్సై రవి, ఎస్బీ ఎస్సై చారి, రాంబాబు ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

