దుమ్ముగూడెం, నవంబర్ 10: ఇందిరమ్మ గ్రామ కమిటీల్లో రాజకీయ జోక్యాన్ని నివారించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని ములకపాడు సెంటర్లో ఆదివారం నిర్వహించిన ఆ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లను అర్హులకే అందించాలని, రేషన్ కార్డులు లేనివారందరికీ కొత్త కార్డులు ఇవ్వాలని, ఎస్టీలకు ట్రైకార్ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాల పేదలకు రాయితీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశలో సీపీఎం నాయకులు యలమంచి వంశీకృష్ణ, యలమంచి రవికుమార్, కారం పుల్లయ్య, మర్మం చంద్రయ్య, కొర్సా చిలకమ్మ, శ్రీనుబాబు, బొల్లి సూర్యచందర్‌రావు, మర్మం సమ్మక్క, కొడాలి లోకేశ్‌బాబు, సోడి రాంబాబు, ఖాదర్‌బాబు, వీర్రాజు, చంటి, సాయిరెడ్డి, బజార్, నరసయ్య, ప్రసాద్, గోవర్ధన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.