హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూములను ప్రభుత్వం ఆక్రమించుకుని వేలం వేసేందుకు యత్నిస్తుండగా అడ్డుకునేందుకు చలో హైదరాబాద్ కార్యక్రమానికి వివిధ సంఘాలు, పార్టీల పిలుపు మేరకు తరలివెళ్తున్న బీఆర్ఎస్వీ, సీపీఎం, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులు మంగళవారం ఎక్కడికక్కడ అడ్డుకొని పోలీస్స్టేషన్లకు తరలించారు.
కూసుమంచిలో సీపీఎం నేతలు తోటకూరి రాజశేఖర్, ఎడవల్లి రమణారెడ్డి, బిక్కసాని గంగాధర్, చీర్ల రాధాకృష్ణలను, పాల్వంచలో బీఆర్ఎస్వీ నేతలు బత్తుల మధుచందర్, జూపల్లి దుర్గాప్రసాద్‌లను, ములకలపల్లిలో డీవైఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు నిమ్మల మధు, అనుముల సాయి, సాయిచరణ్, పండా రాంచరణ్, కీసరి స్వాతి, సూర్యలను, మధిరలో సీపీఎం నాయకులు శీలం నరసింహారావు, పాపినేని రామనర్సయ్య, పడకంటి మురళి, వడ్డానపు మధులను,
సత్తుపల్లిలో సీపీఎం నేతలు కొలికపోగు సర్వేశ్వరరావు, జాజిరి శ్రీనివాస్, రావుల రాజబాబు, చప్పిడి భాస్కర్లను, ఎర్రుపాలెంలో డీవైఎఫ్ఐ నేత మద్దాల ప్రభాకర్‌రావును, ఇల్లెందులో బీఆర్ఎస్వీ నాయకులు గిన్నారపు రాజేశ్, హరిప్రసాద్, చాంద్‌పాషా, పీడీఎస్‌యూ నాయకులు పృథ్వీ, సాంబ, పార్థసారథిలను, భద్రాచలంలో బీఆర్ఎస్వీ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ నాయకులు కీసరి యువరాజు, మునగాల శివ, కొల్లిపాక శివ, ప్రశాంత్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
ఖమ్మంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రఘునాథపాలెం మండలం చిమ్మపూడిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా పార్టీలు, సంఘాల నాయకులు మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో పోరాటాలను ఆపలేరని స్పష్టం చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాలు తప్పవని తేల్చిచెప్పారు. హెచ్‌సీయూ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ కొత్తగూడెంలో బీఆర్ఎస్ నేతలు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
-నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 1