CPM | కారేపల్లి,ఫిబ్రవరి 9: ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు గంగాధరని నాగేశ్వరరావు(70) కన్నుమూశాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
నాగేశ్వరరావు మృతి పట్ల మండల సీపీఎం, బీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపారు. వైరా నియోజకవర్గ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు తాతా ఉపేందర్, బానోతు రాందాస్ నాయక్, సీపీఎం జిల్లా నాయకులు కొండబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కుందనపల్లి ఉపేందర్, నాయకులు వజ్జా మారావు,వడ్డే అజయ్ బాబుతో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు, గ్రామ పెద్దలు నాగేశ్వరావు మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.