కారేపల్లి, జూన్ 13 : గిరిజన గురుకుల బాలుర కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల కొరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు కారేపల్లి మండల పరిధిలోని గాంధీనగర్ కళాశాల ప్రిన్సిపాల్ గూగులోత్ హరికృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గల గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఎంపీసీ, బైపిసి, సిఈసి, హెచ్ఈసిలతో పాటు ఒకేషనల్ గ్రూపుల్లో ఖాళీలను భర్తీ చేయుటకు ఈ నెల 16న భద్రాచలంలోని గిరిజన గురుకుల బాలికల కళాశాలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఐటీడీఏ పీఓ రాహుల్ ఆదేశాలతో ఆర్సిఓ బి.అరుణకుమారి పర్యవేక్షణలో ఈ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్పాట్ అడ్మిషన్ కొరకు కౌన్సిలింగ్ కు వచ్చే విద్యార్థిని, విద్యార్థులు టీసీ, ఎస్ఎస్సీ మెమో, స్టడీ కండక్ట్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ కార్డు, 6 పాస్ ఫొటోలు వెంట తీసుకుని ఉదయం 9 గంటల కల్లా హాజరు కావాలని పేర్కొన్నారు.