Fire Accident | పాల్వంచ, ఫిబ్రవరి 16 : పాల్వంచ పట్టణం ఇందిరానగర్ కాలనీ వాసి గుర్రం అనిల్ అనే వ్యక్తి ఇంటిలో ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఫలితంగా రూ.20వేల ఖరీదు చేసే వంట సామాగ్రి దగ్ధమైంది. అనిల్ భార్య బేబీ వంట చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి వంట సామాగ్రి బాధితుడి ఇంటి పక్కనే ఉన్న బాల శ్రీను అనే వ్యక్తి అప్రమత్తమై వెంటనే కొత్తగూడెం ఫైర్ స్టేషన్కి ఫోన్ చేశారు. అగ్ని మాపక దళ అధికారి గుండా పుల్లయ్య, శివకృష్ణ, హరీష్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. పక్కనే ఉన్న ఇండ్లకు మంటలు అంటుకోకుండా సకాలంలో ఫైర్ ఇంజన్ రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.