కారేపల్లి, మార్చి 13 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని, మాటల గారడీతో పాలన సాగిస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పి.సోమయ్య అన్నారు. చీమలపాడు సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఎరిపోతు నాగయ్య సంస్మరణ సభ గురువారం మండల కార్యదర్శి కె.నరేంద్ర అధ్యక్షతన జరిగింది. నాగయ్య స్థూపాన్ని పి.సోమయ్య, జెండాను పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుల, మత ఉన్మాద చర్యలతో ప్రజలను విభజించి పాలన సాగిస్తుందని విమర్శించారు. పేదల బాధలు తీర్చడానికి పోరాడేది ఎర్రజెండా అన్నారు.
వ్యవసాయ కార్మికులు, రైతులు, గిరిజన, గిరిజనేతర పేదల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాల్లో ఎరిపోతు నాగయ్య ముందుండి పోరాడారని గుర్తు చేశారు. పార్టీని శత్రువు దాడుల నుండి కాపాడడంలో నిర్భంధాలను తట్టుకొని రక్షణ కవచంగా నిలబడ్డారని కొనియాడారు. నాగయ్య మార్గంలో నడవడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి కృష్ణ, మెరుగు సత్యనారాయణ, కొండబోయిన నాగేశ్వరరావు, నాయకులు వజ్జా రామారావు, యనమనగండ్ల రవి, అజ్మీర శోభన్, సూరభాక ధనమ్మ, వల్లబోయిన కొండలరావు ,కల్తీ రామచంద్రయ్య, మద్దెల నాగయ్య, ఎర్రిపోతు భద్రయ్య ,కరపటి సీతారాములు, కరపటి రాంబాయి, రాసబంటి పుల్లయ్య, మన్నెం బ్రహ్మయ్య, రేమల్ల వీరస్వామి ,భానోత్ కిషన్, రాచర్ల రణధీర్, బాదావత్ శ్రీను, బచ్చల బుజ్జమ్మ, శేరు లలితమ్మ, పుప్పాల రమ, భారత లక్ష్మి, మాచర్ల రమేష్, రేమల్ల బాబు పాల్గొన్నారు.