కారేపల్లి, నవంబర్ 26 : కారేపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్ర లేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించారు. విద్యాలయ స్పెషల్ ఆఫీసర్ జి ఝాన్సీ సౌజన్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగం, పౌర హక్కులు, విధుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా విద్యార్థులు గీసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం. విజయలక్ష్మి, ఎం.స్వాతి, కవిత, ఎండీ షహినా సుల్తానా, విజయమమత, కృష్ణవేణి, వసంత పాల్గొన్నారు.

Karepally : కారేపల్లి కస్తూర్బాలో రాజ్యాంగ దినోత్సవం