ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 2 : ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లోని సమగ్ర శిక్షా ఉద్యోగులు సోమవారం అర్బన్ ఎంఈవో కార్యాలయం వద్ద నిరసన దీక్ష నిర్వహించారు. తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, సీఆర్పీలు, ఐఈఆర్పీలు, పీటీఐలు, మెస్సెంజర్స్లు సోమ, మంగళవారాల్లో నిరసన దీక్షలో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వస్తే తమను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని, కానీ.. ఇప్పుడు హామీని విస్మరించారన్నారు. రెగ్యులరైజ్ చేసేలోగా టైమ్ స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసన దీక్షకు పీఆర్టీయూ నాయకులు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఏ ఉద్యోగులు చైతన్యకుమార్, బాలకృష్ణ, అనిల్‌కుమార్, వీరన్న, రామలింగం, లత, రమాదేవి, రాంసింగ్‌నాయక్, ఎస్కే ఇస్మాయిల్ పాల్గొన్నారు.