ఖమ్మం, జనవరి 5 : వచ్చే వేసవిలో జిల్లావ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికతో ముం దుకెళ్లాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. శుక్రవా రం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చేపట్టే ముందు జాగ్రత్త చర్యలపై ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ , ఇరిగేషన్, విద్యుత్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 4 మున్సిపాలిటీలు, 589 గ్రామాల పరిధిలోని నివాస ప్రాంతాల్లో జనాభాకు సరిపోయేంత నీటి లభ్యతపై సమీక్షించారు. జిల్లాలోని తాగునీటి వనరులు, వాటిలో నీటి లభ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో అమృత్ పథకం కింద 18 ఈఎల్ఎస్ఆర్ల నిర్మాణం చేపట్టామని, వీటిలో 16 నిర్మాణా లు పూర్తి చేసి వాడకంలోకి తెచ్చామన్నారు.
మిగతా రెండు వారంలోపు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు. మొత్తం 685 కిలోమీటర్ల మేర పైపులైన్ పూర్తి చేసినట్లు తెలిపారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో ఒక ఈఎల్ఎస్ఆర్, 27.42 కిలోమీటర్ల పైపులైన్ పనులు మంజూరు చేసుకొని.. 93 శాతం మేర పూర్తికాగా.. మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మధిరలో 104.01 కిలోమీటర్ల పైపులైన్, 5 నిర్మాణాలు మంజూరు చేసుకొని, 91 శాతం పను లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సమస్యాత్మక ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, డే, రెసిడెన్షియల్ విద్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్లు తదితర అన్ని ప్రభుత్వ సంస్థల్లో మిషన్ భగీరథ కనెక్షన్లు ఇచ్చి నీటి సరఫరా చేయాలన్నారు. సమీక్షలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ రంజిత్, మిషన్ భగీరథ ఎస్ఈ సదా శివకుమార్, ఈఈలు పుష్పలత, వాణిశ్రీ, ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వరరావు, మున్సిపల్, విద్యుత్, ఇరిగేషన్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.