భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : సాగు రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు నేస్తం కార్యక్రమం ఎంతో ఉపయోగకరం కానున్నదని కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. బుధవారం రైతు నేస్తం కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పర్చువల్ విధానంలో ప్రారంభించగా.. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ రైతులు సాగు చేసి లాభాలు గడించాలన్నారు. రైతు దుక్కి దున్నిన దగ్గర నుంచి పంట వేసే వరకు పంటలపై వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు ఇదొక వేదికలా ఉపయోగపడుతుందన్నారు. రైతుల కోసం పంటల బీమా పథకాన్ని కూడా అమల్లోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఏవో బాబారావు, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షుడు మండే వీరహన్మ