ఖమ్మం, అక్టోబర్ 21: ప్రజావాణి దరఖాస్తులను అధికారులు సకాలంలో పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిషరించాలని అధికారులను ఆదేశించారు.
కల్లూరు మండలం పేరువంచకు చెందిన కె.దుర్గ వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోగా ఎంపీడీవోకు ఎండార్స్ చేశారు. ఖమ్మం రామన్నపేట కాలనీవాసులు తమ ఇండ్లు పూర్తిగా వరదలో మునిగిపోయాయని, సర్వే పూర్తయినప్పటికీ ప్రభుత్వసాయం అందలేదని దరఖాస్తు చేసుకోగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఖమ్మం మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. అధికారులు రాజేశ్వరి, దీక్షా రైనా తదితరులు పాల్గొన్నారు.