కొత్తగూడెం గణేష్ టెంపుల్, జూలై 4 : తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు, దొరల దురాగతాలను ఎదిరించిన గొప్ప వీరుడు దొడ్డి కొమురయ్య అని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం విముక్తి పోరాటం చేసిన మహనీయుడని, తెలంగాణ సాయుధ పోరాటం మాట వినిపించగానే మొట్టమొదట గుర్తుకొచ్చేది దొడ్డి కొమురయ్య పేరేనని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, బీసీ సంక్షేమాధికారి ఇందిర, జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరాం, క్రీడల అధికారి పరంధామరెడ్డి, కలెక్టరేట్ ఏవో అనంత రామకృష్ణ, కురుమ సంఘం సభ్యులు దూడల బుచ్చయ్య, లింగయ్య, రవికుమార్, చంద్రశేఖర్, దూడల కిరణ్, సుంకా ప్రవీణ్, కోటిలింగం, సంపత్‌కుమార్, రవి, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.