తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేయాలి
ఎల్నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురవడం లేదని, దీంతో తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేసుకోవాలని కలెక్టర్ దివాకర టీఎస్ రైతులకు సూచించారు. మధిరలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విత్తన మేళా కార్యక్రమాన్ని కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితులను రైతులు సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు.
- మధిరలో విత్తన మేళా ప్రారంభోత్సవంలో కలెక్టర్ దివాకర
మధిర రూరల్, జూలై 27 : ఎల్నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురవడం లేదని, దీంతో తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేసుకోవాలని కలెక్టర్ దివాకర టీఎస్ రైతులకు సూచించారు. మధిరలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విత్తన మేళా కార్యక్రమాన్ని కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితులను రైతులు సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు.
వర్షాలు పూర్తిస్థాయిలో కురవకపోవడంతో తక్కువ నీటితో సాగయ్యే పెసర, మినుము, కంది, బొబ్బర్లు, నువ్వులు, జొన్నలు, వివిధ రకాల కూరగాయల పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వేసుకోవాల్సిన విత్తనాలను ప్రభుత్వం తరఫున రైతు వేదికల్లో అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. విత్తన మేళా ఈ నెల 29 వరకు కొనసాగుతుందని, మండల రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు, ఏడీఏ వాణిశ్రీ, ఏఆర్ఎస్ శాస్త్రవేత్త నాగస్వాతి, ఏవో సాయిదీక్షిత్, ఏఈవోలు, ప్రజాప్రతినిధులు, విత్తన డీలర్లు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

