రఘునాథపాలెం, జూలై 5 : రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శనివారం ఆయన ఖమ్మం నగరం దానవాయిగూడెంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కోయచలక క్రాస్‌రోడ్డులోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోషల్ వెల్ఫేర్ గురుకులంలో కోటి యాభై లక్షల రూపాయలతో మంజూరు చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. ప్రహరీ నిర్మాణం, గురుకులంలోని వాటర్‌ట్యాంక్‌కు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట సోషల్ వెల్ఫేర్ జోనల్ అధికారి స్వరూపారాణి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి డాక్టర్ పురంధర్, ప్రిన్సిపాల్స్ శైలజ, రాజ్యలక్ష్మి, అరుణకుమారి ఉన్నారు.