కొత్తగూడెం టౌన్, జూలై 19: రాష్ట్రంలో రైతును రాజు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం రాబందుల పాలు కాకుండా కాపాడుకోవా ల్సిన బాధ్యత రైతులపైనే ఉందని అన్నారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపులో భాగంగా సుజాతనగర్ మండలం రాఘవాపురం రైతువేదికలో బుధవారం నిర్వహించిన రైతు సమావేశంలో ఎమ్మెల్యే వనమా మాట్లాడారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ వల్ల, అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ వంటి పథకాల వల్లనే రైతులు రాజుగా వర్ధిల్లుతున్నారని గుర్తుచేశారు. పంటల సాగుకు మూడు గంటలు కరెంటు చాలంటూ రేవంత్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి మాటలు రైతులను, రైతు ప్రభుత్వాన్ని కించపర్చడమే అవుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో ఎంతటి కరెంటు కష్టాలు ఉండేవో ప్రజలెవరూ మర్చిపోలేదని అన్నారు.
ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు బత్తుల వీరయ్య, భూక్యా రాంబాబు, మండే హనుమంతరావు, రెడ్డెం తులసిరెడ్డి, మూడు గణేశ్, పెద్దమళ్ల నరేందర్ ప్రసాద్, శ్యాంసుందర్‌రెడ్డి, సత్యనారాయణ (సంపు), గాజుల సీతారామయ్య, బత్తుల రమేశ్, బత్తుల కేశవరావు, సత్తిరెడ్డి, అమృతరావు, నెహ్రూ, సాంబయ్య, ఇస్తారయ్య, రవి, కాజా, మంగయ్య, తుంకూర్ రాములు, గరిక నారాయణ, నున్న వెంకన్న, రవీందర్, రవి, రావి రాంబాబు, యూసుఫ్, గౌస్, మజీద్, దొమ్మేట్ నాగేశ్వరరావు, పురుషోత్తం, రాజేందర్, రతన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.