కల్లూరు, నవంబర్ 30 : పౌర హక్కులకు భంగం కల్పిస్తే సమాచారాన్ని అందించాలని తహసీల్దార్ బాబ్జీప్రసాద్ అన్నారు. తాళ్లూరు వెంకటాపురంలో బుధవారం నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పించి మాట్లాడుతూ పౌరహక్కులకు ఇబ్బందులు కల్పించినా వారి సమాచారాన్ని అందించాలని ప్రజలను కోరారు. సర్పంచ్ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్సై కొండలరావు, వసతిగృహ సంక్షేమాధికారి స్టాలిన్ పాల్గొన్నారు.
వేంసూరు, నవంబర్ 30 : గ్రామంలో ఎక్కడైనా అంటరానితనం, దళితులను అవమానపరచడం, కులం పేరుతో ద్వేషించడం లాంటి సంఘటనలు చోటుచేసుకుంటే వారిపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని సత్తుపల్లి ఏఎస్సీడీవో పి.లక్ష్మీనారాయణ, తహసీల్దార్ ముజాహిద్దీన్ తెలిపారు. భరిణెపాడు గ్రామంలో పౌరహక్కులపై షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. బాధితులు ఎవరైనా ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. కార్యక్రమంలో చింతకాయల కృష్ణ, సుశీల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.