కారేపల్లి, ఏప్రిల్ 04 : ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో గల 1వ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ టి.గీతాబాయి చిన్నారులచే అన్నప్రాసన చేయించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులకు ప్రభుత్వం సరఫరా చేసే బాలామృతం, గుడ్లు క్రమం తప్పకుండా అందివ్వాలన్నారు. పోషక లోపం కలిగిన చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, వారి ఎత్తు, బరువుల్లో మార్పు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. నెల నెల చిన్నారుల ఎత్తు, బరువు ఇతర ఆరోగ్య స్థితిగతుల ప్రగతిని పోషణ్ యాప్లో నమోదు చేయాలని పేర్కొన్నారు.
Anna Prasana : చిన్నారుల ఆరోగ్య ప్రగతిని పోషణ్ యాప్లో నమోదు చేయాలి : గీతాబాయి