ఎర్రుపాలెం, ఆగస్టు 19 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలోని శ్రీ బాల త్రిపుర సుందరీ సహిత చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయ పాలకవర్గం మంగళవారం ప్రమాణ స్వీకారం చేసింది. ఆలయ ఈఓ రామకోటేశ్వరావు ఆధ్వర్యంలో చైర్మన్‌గా మగినం జయశ్రీ, సభ్యులుగా కాజా జగన్నాధ కృష్ణ, దూదిగం ఫకీరయ్య, భవనం వెంకటప్పారెడ్డి, దేవరకొండ లక్ష్మణ్‌రావు ప్రమాణం చేశారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా అర్చకులు ఎన్.గోపాలకృష్ణ శర్మ నియమితులయ్యారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు, నాయకులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, చావా రామకృష్ణ, శీలం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీనివాసరావు, షేక్ ఇస్మాయిల్, మల్లెల లక్ష్మణరావు, కంచర్ల వెంకట నరసయ్య, గుడేటి బాబురావు, దేవరకొండ శ్రీను, షేక్ జానీ భాష, మొగిలి అప్పారావు, పంబి సాంబశివరావు, బుర్ర నారాయణ, చీదెళ్ల శ్రీనివాసరావు, కొప్పు పరమేశ్వరరావు, అనుమోలు కృష్ణారావు, యరమల పూర్ణచంద్రారెడ్డి, తల్లపురెడ్డి నాగిరెడ్డి, దేవరకొండ రాజీవ్ గాంధీ, శ్రీపాలశెట్టి తిరుపతిరావు, శీలం వెంకటరామిరెడ్డి, సూరంశెట్టి రాజేశ్, సగ్గుర్తి కిశోర్, మగినం నాగేశ్వరరావు, దేవరకొండ రవి, ఏడుకొండలు, మెట్టు కృష్ణ పాల్గొన్నారు.
Yerrupalem : చంద్రమౌళీశ్వర ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారం