వైరారూరల్, జూన్ 15: అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశవ్యాప్తం చేసేందుకే సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం ఆయన వైరా మండలంలో పర్యటించారు. తొలుత అష్ణగుర్తి గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గొల్లపూడి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నూతన గ్రామ పంచాయతీ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రైతువేదికలో జరిగిన పల్లె ప్రగతి దినోత్సవంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ పల్లెల అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేక పోతోందని విమర్శించారు. గ్రామాల అభివృద్ధి విషయంలో కేంద్రం ఇస్తున్న ప్రతి 20 అవార్డుల్లో 18 అవార్డులు తెలంగాణ పల్లెలే సొంతం చేసుకుంటున్నాయని గుర్తుచేశారు.
వీటిని జీర్ణించుకోలేకనే కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ పల్లెల పురోభివృద్ధికి సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పురస్కారాలే రుజువులని అన్నారు. ఈ తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ప్రతీ పథకం ప్రతి కుటుంబానికీ అందిందని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు బాబురావు, నల్లమల వెంకటేశ్వరరావు, పసుపులేటి వినోద, బాణాల లక్ష్మీనర్సమ్మ, బీడీకే రత్నం, వేల్పుల పావని, నంబూరి కనకదుర్గ, కట్టా కృష్ణార్జున్రావు, పసుపులేటి మోహన్రావు, బాణాల వెంకటేశ్వరరావు, రవీందర్రెడ్డి, తాతా బసవయ్య, మద్దెల రవి, మచ్చా బుజ్జి, డాక్టర్ కాపా మురళీకృష్ణ, మిట్టపల్లి సత్యంబాబు, షేక్ సైదా, వేల్పు ల మురళి, శ్రీదేవి, జ్యోత్స్న, పవన్, మోరంపూడి ప్రసాద్ పాల్గొన్నారు.