కారేపల్లి, ఏప్రిల్ 09 : కారేపల్లి మండల పరిధిలోని బజ్జాతండా గ్రామ పంచాయతీలో ఆర్ అండ్ బి రోడ్డు నుండి స్మశాన వాటిక వరకు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను స్థానిక సర్పంచ్ వాంకుడోత్ హనుమంతరావు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వి.హనుమంతరావు, పంచాయతీ కార్యదర్శి. పాలకవర్గం, గ్రామస్తులు హేమ్లా నాయక్, అజ్మీరా రవి, అజ్మీర నారాయణ, అజ్మీర సురేష్, కిషోర్, రాంబాబు, చందర్, చిట్టిబాబు పాల్గొన్నారు.