ఖమ్మం: జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చింతకాని మండలం జగన్నాథపురం సమీపంలో ఓ కారు వాగులోకి దూసుకెళ్లింది. ఆదివారం తెల్లవారుజామున ఖమ్మం నుంచి విజయవాడవైపు వెళ్తున్న కారు జగన్నాథపురం వద్ద బొమ్మలవాగులోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు కారులో ఉన్నవారిని బయటకు తీశారు. అయితే కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.