చింతకాని, అక్టోబర్ 27: బీఆర్ఎస్ చింతకాని మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అక్రమ అరెస్టును నిరసిస్తూ ప్రొద్దుటూరు గ్రామంలో అయ్యప్ప భక్తులు, గ్రామస్తులు ఆదివారం కొవ్వొత్తుల శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతు మృతిచెందితే ఎక్స్గ్రేషియా కోసం నిరసనలో పాల్గొన్న నాయకులు,
వ్యక్తులను అరెస్టు చేయడం సమజసం కాదన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను అరెస్టు చేయడం ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్యేనని విమర్శించారు. ఈ అక్రమ అరెస్టులను తామంతా వ్యతిరేకిస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.