మధిర, మే27 : మధిర పట్టణంలోని 18వ డివిజన్ లడక్ బజార్ నందు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద కొత్త కల్వర్ట్ నిర్మించాలని స్థానిక మహిళలు మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లడక్ బజార్ నందు రైల్వే మూడో లైన్ నిర్మాణం వల్ల కల్వర్టు మూసుకుపోయి వరద నీరు వెళ్లే పరిస్థితి లేదన్నారు. కొత్త కల్వర్టు నిర్మించి అకాల వర్షాల కారణంగా వరద నీటి నుండి నివాస ప్రాంతాలను కాపాడాలని వారు కోరారు.
అలాగే కాల్వలో పూడిక తీపించి వరద నీరు ప్రవహించే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ వెంటనే పరిశీలించి వరద నీరు నివాస ప్రాంతాలను ముంపునకు గురికాకుండా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందజేసిన వారిలో వనపర్తి కళావతి, సాజిదా, హనీఫా బి.బేగం, జానబీ, ఖాసీంబి, మరియమ్మ ఉన్నారు.