ఖమ్మం, జనవరి 12: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల బడ్జెట్ను ప్రణాళికాబద్ధంగా రూపొందించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. బడ్జెట్ రూపకల్పనపై మున్సిపల్ కమిషనర్లతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వేతనాలు, కరెంట్ చార్జీలు, సీసీ ఛార్జీలు, రుణాల చెల్లింపులకు ప్రాధాన్యం కల్పించాలని సూచించారు.
మున్సిపాలిటీలు ప్రభుత్వం అందించే గ్రాంట్తోపాటు రెవెన్యూను పెంపొందించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రాపర్టీ టాక్స్ వంద శాతం వసూలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.