మణుగూరు టౌన్, జూన్ 15: కాంగ్రెస్ ప్రభుత్వం అక్కసుతో పెట్టిన కేసును ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ ఎదుట హాజరవుతున్నందున ఆయనకు మద్దతుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ ముఖ్య నాయకులందరూ పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు తరలిరావాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
సోమవారం ఉదయం 9 గంటలకల్లా హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు చేరుకోవాలని సూచించారు. గత బీఆర్ఎస్ను, కేటీఆర్ ఇమేజ్ను బదనాం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు అందరూ కదలిరావాలని కోరారు.