సత్తుపల్లి, జనవరి 29 : కార్యకర్తలకు అండగా ఉండి వారి కుటుంబాలకు భరోసా కల్పించే పార్టీ బీఆర్ఎస్ అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండల పరిధిలోని కాకర్లపల్లి గ్రామానికి చెందిన హెచ్చు వెంకటేశ్వరరావు ఇటీవల ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. బీఆర్ఎస్ సభ్యత్వం పొంది ఉండడంతో పార్టీ నుంచి మంజూరైన రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కును ఆదివారం క్యాంపు కార్యాలయంలో మృతుడి భార్య జయమ్మకు ఎమ్మెల్యే సండ్ర అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ సభ్యత్వం పొందిన ప్రతి వ్యక్తి కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారన్నారు. కార్యకర్తలు ప్రమాదవశాత్తు మృతిచెందితే వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు బీమా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి పథకాన్ని ప్రజల ముంగిటకు తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ను బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఎంపీపీ దొడ్డా హైమావతి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, పార్టీ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, కౌన్సిలర్ మట్టా ప్రసాద్, కాకర్లపల్లి నాయకులు ఏగోటి పెద్దిరాజు, కంచర్ల నాగేశ్వరరావు, దేవరపల్లి సత్యనారాయణ, పరిమి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.