వైరా టౌన్, ఏప్రిల్ 11 : ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎలకతుర్తి గ్రామంలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను జయప్రదం చేయాలని పార్టీ వైరా పట్టణాధ్యక్షుడు మద్దెల రవి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దెల రవి, దిశా కమిటీ మాజీ సభ్యుడు కట్ట కృష్ణార్జునరావు, వైరా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లపాటి సీతారాములు మాట్లాడుతూ మహాసభకు వేలాదిగా తరలి వచ్చేలా ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని పేర్కొన్నారు.