టేకులపల్లి, మే 1 : బొమ్మనపల్లి వద్ద ఇల్లెందు నియోజకవర్గంలోకి ప్రవేశించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు ఆ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్‌గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఘన స్వాగతం పలికారు. టేకులపల్లిలో మాజీ ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు కేసీఆర్‌కు హారతులు పట్టారు. బస్సుకు క్షీరాభిషేకం చేసి పూల వర్షం కురిపించారు.
అలాగే ఇల్లెందు మండల నాయకులు శీలం రమేశ్, కంభంపాటి రేణుక, దాస్యం ప్రమోద్‌ల ఆధ్వర్యంలో ఇల్లెందు కరెంట్ ఆఫీస్ సెంటర్ వద్ద, పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు బానోత్ హరిసింగ్‌నాయక్, లక్కినేని సురేందర్‌రావు, బోడ బాలునాయక్, రామానాయక్, కిషన్‌నాయక్, అప్పారావు, బాలాజీ, శివ, భూక్యా లాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.