ఖమ్మం, సెప్టెంబర్ 9 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన ఖమ్మం నగర బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు చేయూతనిచ్చారు. ఖమ్మం నగరంలోని 46, 30, 4, 17, 34వ డివిజన్ల పరిధిలో 270 మంది కుటుంబాలకు సుమారు 2 లక్షల 30వేల రూపాయల విలువచేసే నిత్యావసర సరుకుల కిట్లను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సోమవారం ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్ సహకారంతో బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికే 10వేల మందికి నిత్యావసర సరుకులు అందించినట్లు తెలిపారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపుమేరకు వరద బాధితులకు సరుకులను స్వతహాగా పగడాల నాగరాజు, కూరాకుల నాగభూషణం అందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ముకాల కమల, కన్నం వైష్ణవి ప్రసన్న, దండా జ్యోతిరెడ్డి, నాయకులు కోడి లింగయ్య, బొల్లేపల్లి విజయ్, సారిక రాము, మధు, మేడిదెల మల్లేష్, భిక్షం, సుబ్బాచారి పాల్గొన్నారు.