బీఆర్ఎస్ గ్రాండ్ సక్సెస్
ఖమ్మం నగరంలోని మమత ఆసుపత్రి గ్రౌండ్ వేదికగా ఆదివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీ య సమ్మేళనం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు సభకు భారీగా తరలివచ్చారు. వీధులన్నీ గులాబీమయమయ్యాయి.
- గులాబీ శ్రేణులతో నిండిన మమత ఆసుపత్రి ప్రాంగణం
- జోష్ నింపిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పీచ్
రఘునాథపాలెం, ఏప్రిల్ 19: ఖమ్మం నగరంలోని మమత ఆసుపత్రి గ్రౌండ్ వేదికగా ఆదివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీ య సమ్మేళనం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు సభకు భారీగా తరలివచ్చారు. వీధులన్నీ గులాబీమయమయ్యాయి.
నాయకులు ఊహించిన దానికంటే అధికసంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆనందం వ్యక్తంచేశారు. త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని, జోష్‌ను నింపే ప్రసంగాన్ని అందించాలనే ఉద్దేశంతో ఖమ్మంలో భారీ ఆత్మీయ సమ్మేళనానికి శ్రీకారం చుట్టడం జరిగిందని మాజీ మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. శాసనసభాపక్ష ఉప నాయకుడు తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ ఖమ్మంలో పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారని, పార్టీ శ్రేణుల జోష్ చూస్తుంటే 2028 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందనే ధీమాను వ్యక్తంచేశారు. నగరంలోని అన్ని డివిజన్ల నుంచి పార్టీ కార్యకర్తలు ర్యాలీలుగా బయల్దేరి వచ్చారు.
మమత ఆసుపత్రి ప్రాంగణం మొత్తం గులాబీ శ్రేణులతో నిండిపోయింది. పలువురు ఆసుపత్రి ప్రాంగణం బయట ఉండి ఆసక్తిగా హరీశ్‌రావు ప్రసంగాన్ని విన్నారు. సుమారు 10వేల మంది కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరికీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పసందైన విందు భోజనం అందించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

