వంద రోజుల్లోనే పాలన గాడి తప్పింది
గ్రామం బాగుంటేనే గ్రామంలోని ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారనేది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నినాదం. అందుకు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పదేళ్ల పాలనలో గ్రామాల్లోని చెరువులను పునరుద్ధరించి ప్రాజెక్టులను కట్టించి సాగు, తాగు నీటికి ఇబ్బంది లేకుండా పాలన సాంగించిన మహనీయుడు కేసీఆర్ అని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
- రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల పంట దెబ్బతిన్నది
- కాంగ్రెస్ పాలనలో సకల జనులు ఇబ్బంది పడుతున్నారు
- కాంగ్రెస్ మాయమాటలు, మోసపూరిత హామీలను ఎండగట్టండి
- పార్లమెంటులో తెలంగాణ అభివృద్ధిని చాటింది బీఆర్ఎస్ ఎంపీలే..
- కేంద్రం నుంచి రూ.2,653 కోట్ల నిధులు తీసుకువచ్చాం
- పార్లమెంటులో గళమెత్తాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలి
- ఎంపీ నామా నాగేశ్వరరావు
అశ్వారావుపేట టౌన్/అశ్వారావుపేట, ఏప్రిల్ 4 : గ్రామం బాగుంటేనే గ్రామంలోని ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారనేది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నినాదం. అందుకు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పదేళ్ల పాలనలో గ్రామాల్లోని చెరువులను పునరుద్ధరించి ప్రాజెక్టులను కట్టించి సాగు, తాగు నీటికి ఇబ్బంది లేకుండా పాలన సాంగించిన మహనీయుడు కేసీఆర్ అని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మి ఓటు వేస్తే పాలన సాగించి నాలుగు నెలలు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ పాలనపై మండిపడుతున్నారు. గురువారం అశ్వారావుపేట మండలస్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అధ్యక్షతన పట్టణ సమీపంలో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఎంపీ నామా మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగునీటి సమస్యతో 15 లక్షల ఎకరాలలో పంట దెబ్బతిన్నదని, అందుకు లెక్కలతో సహా పార్టీ వెల్లడించడం జరిగిందన్నారు. వందరోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని సకల జనులు ఇబ్బందులు పడ్డారని యన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అవలంభిస్తున్న మోసపూరిత పాలనపై పార్లమెంటులో గళమెత్తాల్సిన అవసరం ఉన్నదని, అందుకు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా మరోమారు పోటీచేసే అవకాశం అందించిన కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టేందుకు కార్యకర్తలు కష్టపడి పనిచేసి రెండు లక్షల ఓట్లు మెజార్టీతో గెలిపించాలన్నారు.
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో అభివృద్ధి పరుగులు తీసిందని ఒక్క ఖమ్మం జిల్లాకు ఎంపీగా నేను కేంద్రం నుంచి రూ.2,635 కోట్లు నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశామన్నారు. కొవ్వూరు- భద్రాచలం రైల్వే లైన్ మంజూరులోనూ, జిల్లాలోని నేషనల్ హైవే రోడ్లు ముద్ర బీఆర్ఆర్, నామా ముద్రేనని సగర్వంగా చెప్పుకుంటున్నానని అన్నారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని కానీ ఈ మోసపూరిత కాంగ్రెస్ పాలనలోని కొద్ది రోజులకే ప్రజా పాలన అస్థవ్యస్తంగా మారిందని దుయ్యబట్టారు. మళ్ళీ పార్లమెంటు ఎలక్షన్ల పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి మొండి చేయి చూపించేందుకు వస్తారని.. ఇంకా ఎన్నికలు చాలా ఉన్నాయని గెలిచేది.. వచ్చేది బీఆర్ఎ పార్టీఏనని కాంగ్రెస్ కార్యకర్తల బెదిరింపులకు, కేసులకు బయపడేది లేదని ప్రతి కార్యకర్తకు నేను, మన పార్టీ అండగా ఉంటుందని అభయమిచ్చారు. సమావేశంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, జట్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మీ, వైస్ ఎంపీపీ చిట్టూరి ఫణీంద్ర, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాశరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణ, నాయకులు వెంన్నబాబు, గారపాటి సూర్యనారాయణ, నారం రాజశేఖర్, ఎంపీటీసీలు లలిత, నాగలక్ష్మీ, పండా రాజు, పాయం రమేశ్, పద్దం కుమారి, జేకేవీ రమణారావు, మందపాటి మోహన్‌రెడ్డి, సంకా ప్రసాద్, కాసాని చంద్రశేఖర్, సాదు జ్యోష్నాబాయ్, మోటూరి మోహన్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

