కారేపల్లి,ఫిబ్రవరి 7: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి పొందుతున్న సింగరేణి మండలం మాజీ జెడ్పిటిసి వాంకుడోత్ జగన్ నాయకును శుక్రవారం ఎమ్మెల్సీ,బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్ రావు పరామర్శించారు. భాగ్యనగర్ తండాలో గల జగన్ ఇంటికి వెళ్లిన తాత మధు ప్రమాదం జరిగిన తీరు, ప్రస్తుత ఆరోగ్య స్థితిగతులపై అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పారు.ఆయన వెంట మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ,మాజీ జెడ్పిటిసి ఉన్నం వీరేందర్,మాజీ వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సొసైటీ వైస్ చైర్మన్ ధరావత్ మంగీలాల్,జిల్లా యూత్ నాయకులు ముత్యాల వెంకట అప్పారావు,అడప పుల్లారావు,మాజీ సర్పంచ్ బాణోత్ కుమార్,శివరాత్రి అచ్చయ్య,బత్తుల శ్రీనివాసరావు,బానోతు రాందాస్,ఇస్లావత్ బన్సీలాల్, సిద్ధంశెట్టి నాగయ్య,జాలా సాంబ,షేక్ ఖాజావలి,యాకుబ్ పాషా,షేక్ సలీం గూగులోత్ భాస్కర్,బాబులాల్,సూక్య తదితరులు పాల్గొన్నారు.