మధిర, అక్టోబర్16: రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమక్షంలో సోమవారం మధిర బీఆర్ఎస్ పార్టీ జోనల్ స్థాయి బూత్ కమిటీ సమావేశంలో ముదిగొండ సహకార సంఘం మాజీ అధ్యక్షుడు బత్తుల వెంకట్రావు, బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పలు పార్టీల కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు మంత్రి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్యకర్తలకు, నాయకులకు బీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజు, కొండబాల కోటేశ్వరరావు, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, బ్రాహ్మణపల్లి సర్పంచ్ జెర్రిపోతుల రవీందర్, గ్రామ అధ్యక్షుడు వంగాల కృష్ణ, ముదిగొండ మండల అధ్యక్షుడు వాచేపల్లి లక్ష్మారెడ్డి, పోట్ల ప్రసాద్, జడ్పీటీసీ పసుపులేటి దుర్గ, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మధిరటౌన్, అక్టోబర్16: స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మధిర 21వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నుంచి వేల్పుల శివ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లపోతుల వెంకటేశ్వరరావు, పట్టణ కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు, కౌన్సిలర్ వై.వీ.అప్పారావు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మధిర, అక్టోబర్16: మధిర బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి లింగాల కమల్‌రాజు ఎన్నికల ప్రచార సీడీని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సోమవారం విడుదల చేశారు. బోనకల్లు మండలం చిరునోముల గ్రామానికి చెందిన ప్రజా జానపద గాయకుడు చాపలమడుగు కోటేశ్వరరావు రచించి స్వయంగా ఆలపించి రికార్డు చేసిన ఆడియో సీడీని మంత్రి పువ్వాడకు అందజేశారు. దానిని ఆయన లింగాల కమల్‌రాజు సమక్షంలో విడుదల చేసి పాటను సమావేశంలో వినిపించి గాయకుడిని అభినందించారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, నాయకులు కొండబాల కోటేశ్వరరావు, కూరాకుల నాగభూషణం, నల్లమల వెంకటేశ్వరరావు, మొండితోక లత, మెండెం లలిత తదితరులు పాల్గొన్నారు.
మధిర, అక్టోబర్16: ఎన్నికల ప్రచారంలో భాగంగా మధిర చేరుకున్న మంత్రి పువ్వాడ మార్గమధ్యమంలో మధిర అంబేద్కర్‌సెంటర్ వద్ద ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొని గాయాలయ్యాయి. మంత్రి వెంటనే కారు దిగి తన కాన్వాయిలో మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం వైద్యులను కలిసి సదరు వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.