వృద్ధాప్య పెన్షన్కూ అవకాశం కల్పించండి
అన్ని రకాల ప్రభుత్వ పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారితోపాటు వృద్ధాప్య పెన్షన్కూ అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ముదిగొండ మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. బస్టాండ్ సెంటర్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా చేపట్టారు.
- ముదిగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన, ధర్నా
ముదిగొండ, ఆగస్టు 14 : అన్ని రకాల ప్రభుత్వ పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారితోపాటు వృద్ధాప్య పెన్షన్కూ అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ముదిగొండ మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. బస్టాండ్ సెంటర్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా చేపట్టారు.
అనంతరం తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఇవ్వనున్న పెన్షన్లలో వృద్ధాప్య పెన్షన్ లేనందున వారికి కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, లేదంటే వృద్ధులను కలుపుకొని మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ నాయకులు వాచేపల్లి లక్ష్మిరెడ్డి, సామినేని హరిప్రసాద్, గడ్డం వెంకట్, బంక మల్లయ్య, పచ్చ సీతారామయ్య, కనగాల వెంకటేశ్వర్లు, మరికంటి లాలయ్య, ఆనందరావు, మాలోజి గోవిందు, ఎండీ ఖాసీం బాబు, వడ్డెల్లి కిరణ్, తాటికొండ ఉపేందర్, సామినేని నాగేశ్వరరావు, షేక్ ఖాజా, బత్తుల వెంకట్రావు, పొనుకుల కోటేష్, కోటి అనంత రాములు, బంక విజయ్, పోట్ల ప్రసాద్, పయ్యావుల వెంకటేశ్వరరావు, కొత్తపల్లి పద్మ నాగార్జున, చెరుకుపల్లి భిక్షం, పడిశాల భద్రయ్య, మల్లేపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

