‘గుర్తూ గుర్తుంచుకో.. కారును గుర్తుంచుకో.. కారు గుర్తుకే మన ఓటు.’ అంటూ ఏ గల్లీకి వెళ్లినా మైకులు, నినాదాలు హోరెత్తుతున్నాయి. గులాబీ శ్రేణులన్నీ వీధుల్లో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తును చూపిస్తూ ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు చూపిస్తూ.. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి. ఇంటింటికీ వెళ్లి చిన్నా పెద్దాను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వారిలో ఒకరిగా మమేకమవుతున్నారు. కైకొండాయిగూడెంలో బుధవారం ఇలా బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఉత్సాహపరిచారు.
బీఆర్ఎస్ పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఆయన తనయలు దీపిక, దీప్తి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఐదేళ్లలో తండ్రి నియోజకవర్గంలో చేనట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగా బుధవారం కందాళ తనయ దీపిక కూసుమంచి మండలం రాజుపేటలో వ్యవసాయ కూలీలను ఓట్లు అభ్యర్థిస్తూ కనిపించారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. ఆయన గెలుపుకోసం కుటుంబ సభ్యులూ ప్రచారంలో పాల్గొంటున్నారు. బుధవారం సండ్ర సతీమణి మహాలక్ష్మి సత్తుపల్లి పట్టణంలో బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరిస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు.
భద్రాచలంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్నది.. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావు పార్టీ శ్రేణులన్నింటినీ కొలుపుకొంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ‘గులాబీ’ నాయకులు భద్రాచలం ట్టణంలో ఈవీఎం నామూనా చూపిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు.
ఏజెన్సీలో గులాబీ దళం గెలుపు కోసం పనిచేస్తున్నది. వారికి ఊరూరా ఘనస్వాగతం అభిస్తున్నది. ప్రచారంలో భాగంగా బుధవారం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావు చర్ల మండల కేంద్రానికి వెళ్లగా స్థానిక మహిళలు స్వాగతం పలికారు. ఎన్నికల్లో మద్దుతు నిలుస్తామని స్థానిక మహిళలు వీర తిలకం దిద్దారు.
అశ్వారావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు గ్రామగ్రామానికి వెళ్లి ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఆయన అశ్వారావుపేట మండలంలోని వినాయకపురంలో ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులకు ఆయనపై పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు.
రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో ఉన్నానని, ‘మీలో ఒకడిని.. మీ వాడిని..’ అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. మరోసారి అవకాశం ఇస్తే మరింత సేవ చేస్తానని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. – పాల్వంచ, నవంబర్ 22
బీఆర్ఎస్ వైరా ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌లాల్ ప్రచారంలో చిరునవ్వుతో ప్రజలను ఓట్లు అభర్థిస్తున్నారు. ఎస్టీ తండాల్లో వారి భాషలో మాట్లాడుతూ వారిలో ఒకడిగా కలిసిపోతున్నారు. ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన జూలూరుపాడు మండలంలో రోడ్ షో నిర్వహిస్తూ కనిపించారు.
కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు గెలుపును కాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా బుధవారం వనమా కోడళ్లు బేబి సరోజిని, సుజాత, మనుమరాళ్లు డాక్టర్ వనమా అలేఖ్య, వనమా హర్షిణి పాల్వంచ పట్టణ పరిధిలోని కేటీపీఎస్ వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విధులకు వెళ్లే ఉద్యోగులను కలిసి బీఆర్ఎస్కు ఓటు వేయాలని అభ్యర్థించారు.
ఖమ్మం నగరం గులాబీ శ్రేణుల ప్రచారంతో హోరెత్తుతున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రతి డివిజన్‌కు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. మున్ముందు నియోజకవర్గంలో చేపట్టబోయే పనులనూ వివరిస్తున్నారు.