ఖమ్మం, మే 23 : నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న ఏనుగుల రాకేశ్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ప్రచార రథాలను(ఆటోలను) రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌తో కలిసి గురువారం ప్రారంభించారు. ఖమ్మం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయం(తెలంగాణభవన్)లో ప్రచార రథాలను ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ రాకేశ్‌రెడ్డికి ఘనవిజయం చేకూర్చేందుకు ఈ ప్రచార రథాలను ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.