కారేపల్లి, జూలై 21 : కారేపల్లిలో గల శ్రీ వెంకటసాయి నగర్లో సోమవారం ఆషాడ మాస బోనాలను ఘనంగా నిర్వహించారు. కాలనీవాసులు బోనాలను నెత్తిన పెట్టుకుని డప్పు, వాయిద్యాలతో ప్రదర్శనగా ఇటీవల నూతనంగా ప్రతిష్ఠించిన ముత్యాలమ్మ తల్లి గుడి వద్దకు వెళ్లి బోనాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు చందావతు లక్ష్మణ్, రాంబాబు, కర్ణ, శంకర్, నాగేశ్వరరావు, లక్ష్మణ్, నాగేశ్, సర్వన్, ఈశ్వర్, తారాచంద్, వీరునాయక్ పాల్గొన్నారు.